AC Helmets | అబ్బా.. ఏం ఐడియా.. ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లు, పోర్టబుల్ ఫ్యాన్లు..

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:AC Helmets|దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పాటు వడగాలుల తీవ్రత కూడా ఎక్కువవుతోంది. ఇలాంటి కఠిన వాతావరణంలోనూ రోడ్లపై గంటల తరబడి నిలబడి విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు(traffic police) ఉపశమనం కలిగించేందుకు అధికారులు ఒక వినూత్నమైన అడుగు వేశారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందిని ఎండదెబ్బ నుంచి కాపాడేందుకు ప్రయోగాత్మకంగా ‘ఏసీ హెల్మెట్లు’, ‘పోర్టబుల్ ఫ్యాన్లను’ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం వీటి పనితీరును పరిశీలిస్తున్నారు.

AC Helmets|క్షేత్రస్థాయి సిబ్బందికి పెద్ద ఊరట..

రద్దీ కూడళ్లలో ఎండ తీవ్రతకు గురయ్యే సిబ్బంది కోసం ఈ చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పరికరాల ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి విజయవంతమైతే, ట్రాఫిక్ నియంత్రణలో ఉండే సిబ్బందికి వీటిని నిరంతరం ఉపయోగించేలా పూర్తిస్థాయిలో పంపిణీ చేయనున్నారు. తీవ్రమైన ఎండల వల్ల వచ్చే అలసటను తగ్గించడానికి ఈ ఆధునిక పరికరాలు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు.

AC Helmets

AC Helmets|అసలు ఏసీ హెల్మెట్లు ఎలా పనిచేస్తాయి?

ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 43 డిగ్రీల మార్కును దాటేశాయి. ఈ నేపథ్యంలో ఈ కూలింగ్ హెల్మెట్లు ఎంతవరకు ఉపయోగపడతాయనే చర్చ నడుస్తోంది. అయితే, ఈ హెల్మెట్ల వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. తల భాగంలో అంతర్గత ఉష్ణోగ్రతను చల్లబరచడం ద్వారా వడదెబ్బ, తలతిరగడం , ఎండ వల్ల వచ్చే నీరసాన్ని ఇవి తగ్గిస్తాయి. శరీరం చల్లగా ఉండటం వల్ల సిబ్బంది అలసిపోకుండా, ట్రాఫిక్ నిర్వహణపై మరింత అప్రమత్తంగా దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. కొన్ని రకాల ఏసీ హెల్మెట్లకు ఫేస్ షీల్డ్స్ కూడా ఉంటాయి. ఇవి రోడ్లపై ఉండే దుమ్ము, ధూళి , కాలుష్య కారకాలు ముఖానికి సోకకుండా అడ్డుకుంటాయి.

AC Helmets | ఢిల్లీని వణికిస్తున్న వడగాలులు..

భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 43.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణ సగటు కంటే 3.4 డిగ్రీలు ఎక్కువ. అలాగే రాత్రి వేళల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా (28.4 డిగ్రీలు) ఉంటోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2.3°C నుంచి 4.8°C వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో విధుల్లో ఉండే పోలీసులకు ఈ ఏసీ హెల్మెట్ల ప్రయోగం ఒక వరంలా మారుతుందని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: Excise Duty Cut|వాహనదారులకు గుడ్ న్యూస్..పెట్రోల్, డీజిల్‌పై రూ.10 తగ్గింపు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *