అక్షరటుడే, ఇందూరు: Minority Women Sewing Machines | మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని న్యాక్ సెంటర్‌లో మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను అందజేశారు.
Minority Women Sewing Machines | మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో..
మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని షబ్బీర్ అలీ (Shabbir Ali) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు తమ కుటుంబాలకు అండగా నిలిచి, గౌరవప్రదమైన జీవనం సాగించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
Minority Women Sewing Machines | నిజామాబాద్ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో రూ.1.02 కోట్ల వ్యయంతో మొత్తం 1,700 కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామని షబ్బీర్ అన్నారు. అందులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 500 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించడం సంతోషకరమన్నారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని రంగాల్లో మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, నుడా ఛైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్, జావిద్ అక్రమ్, ఎంఏ పహీం, నయీం, కరీం, పాపా ఖాన్, హఫీస్ లయీక్ ఖాన్, హరూన్ ఖాన్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bodhan Co-option | బోధన్ కో–ఆప్షన్ ఎన్నికలను బహిష్కరించిన ఎంఐఎం, బీజేపీలు