Karnataka SIR Process | ఓటు పోతే.. పథకాలు అందవు : కర్ణాటక సీఎం

కర్ణాటకలో ఎస్​ఐఆర్​ ప్రక్రియను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్​లోని తన నివాసంలో ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka SIR Process | కర్ణాటకలో ఎస్​ఐఆర్​ ప్రక్రియ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్​లోని తన నివాసంలో ప్రారంభించారు.

ఎన్నికల సంఘం (Election Commission) అధికారులు ఎన్యుమరేషన్​ ఫారాన్ని అందజేయగా.. ఆయన దానిని పూర్తి చేసి సమర్పించి, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మొదటి ప్రతినిధిగా, SIR నేడు తన ఇంటి నుంచే ప్రారంభమైందన్నారు. ఫారంలో వివరాలు నింపడం కష్టంగా అనిపించిందని పేర్కొన్నారు. ప్రజలు ఈ ఫారాన్ని జూలై 29వ తేదీలోగా పూరించి సమర్పించాలని సూచించారు. ఎస్​ఐఆర్​ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు పోతే ప్రభుత్వ పథకాలు అందడం కష్టం అవుతుందన్నారు.

Karnataka SIR Process | ధృవపత్రం సమర్పించాలి

Karnataka SIR Process

2002కు ముందు ఓటు వేయని కొత్త ఓటర్లు, చెల్లుబాటు అయ్యే నివాస ధృవీకరణ పత్రం లేదా కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రజలకు సహాయపడటానికి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుందని ప్రకటించారు.

ఇది కూడా చదవండి..:  Modi Review Meeting | నేడు ప్రధాని మోదీ కీలక సమావేశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *