అక్షరటుడే, వెబ్‌డెస్క్: Assam Election Results | అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టనుంది. మూడో సారి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. 91 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
అస్సాం (Assam)లో మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 64 కాగా.. బీజేపీ 91 అభ్యర్థులు 91 చోట్ల లీడ్‌లో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ 28 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 2 రెండు చోట్ల లీడ్‌లో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ (BJP) దూసుకు పోతుంది. దీంతో కమలం పార్టీ నేతలు సంబరాలకు సిద్ధం అవుతున్నారు. సీఎం హిమంత బిస్వా శర్మ లీడ్‌లో ఉన్నారు.
Assam Election Results | రెండోసారి సీఎం
అస్సాంలో హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) రెండోసారి సీఎం కానున్నారు. బీజేపీ ఇక్కడ 2016 నుంచి అధికారంలో ఉంది. ఇప్పుడు గెలిస్తే హ్యాట్రిక్ కొడుతోంది. 2016 నుంచి 2021 వరకు సర్బనంద సోనోవాల తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం 2021లో హిమంత సీఎం అయ్యారు. ఫలితాల్లో ఆ పార్టీ దూసుకు పోతుండటంతో రెండో సారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
Assam Election Results | తమిళనాడులో..
తమిళనాడు (Tamil Nadu)లో టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ 103 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఏఐడీఎంకే 76, డీఎంకే 55 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అధికార డీఎంకే కూటమి మూడో స్థానానికి పరిమితం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది చెన్నైలో DMK ఆఫీసు ముందు టెంట్లు తొలగించారు. తమిళనాడులో 118 స్థానాల్లో గెలిస్తే అధికారం దక్కించుకోవచ్చు. విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు సమీపంలో ఉంది.
ఇది కూడా చదవండి..: Bengal Election Results | బెంగాల్లో బీజేపీ హవా.. టీఎంసీకి షాక్ తప్పదా

