Rahul Gandhi | విద్యార్థులను కలిసి మాట్లాడండి.. జార్ఖండ్​ సీఎంకు రాహుల్ గాంధీ లేఖ

జార్ఖండ్​లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలిసి మాట్లాడాలని రాహుల్​ గాంధీ సీఎం హేమంత్​ సోరెన్​కు సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi | జార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ (Hemant Soren)కు రాహుల్​ గాంధీ లేఖ రాశారు. రాష్ట్రంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలిసి మాట్లాడాలని సూచించారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవని ఆయన పేర్కొన్నారు.

జార్ఖండ్​ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మళ్లీ పరీక్ష నిర్వహించాలని, కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థులు డిమాండ్​ చేస్తున్నారు. 24 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అధికారంలో ఉన్న తమ మిత్రపక్షం, జార్ఖండ్​ సీఎంకు లేఖ రాశారు.

Rahul Gandhi | విద్యార్థులకు మద్దతు

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (JSSC-CGL) పరీక్ష, ఇతర నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు రాంచీలో ధర్నా చేస్తున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. శాంతియుత నిరసన హక్కు మన ప్రజాస్వామ్యానికి కేంద్ర స్తంభాలలో ఒకటి అన్నారు. విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు తామ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థులతో సంప్రదింపులు ప్రారంభించడాన్ని అభినందించారు. నిరసన చేస్తున్న విద్యార్థుల ప్రతినిధులతో వ్యక్తిగతంగా సమావేశం కావాలని సీఎం హేమంత్​ సోరేన్​కు ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi Supreme Court | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *