అక్షరటుడే, వెబ్డెస్క్: Ambubachi Mela | అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయం (Kamakhya Temple) తలుపులు నేడు ఉదయం తిరిగి తెరుచుకున్నాయి. వార్షిక ‘అంబుబాచి మేళా’ సందర్భంగా మూడు రోజులు ఆలయ గర్భగుడిని పూర్తిగా మూసేశారు. నేడు ఆలయం మళ్లీ తెరవడంతో అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలైన పవిత్ర జలం (అంగోదక్), ఎర్రటి వస్త్రం కోసం భక్తులు పోటెత్తారు.
అంబుబాచి మేళా తూర్పు భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన మతపరమైన కార్యక్రమాలలో ఒకటి. ఈ ఉత్సవం జూన్ 22న ప్రారంభమైంది. జూన్ 22 రాత్రి 9:08 గంటలకు ‘ప్రవృత్తి’ (Pravritti) అనే ఆచారంతో ఈ ఉత్సవం మొదలైంది. ఇది కామాఖ్య దేవి వార్షిక ఋతుక్రమ కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఆచారం తర్వాత ఆలయ ద్వారాలు మూడు రోజుల పాటు మూసి ఉంచారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించరు. శుక్రవారం ఉదయం నిత్య పూజ పూర్తయిన తర్వాత ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకున్నారు.
Ambubachi Mela | భారీగా తరలి వచ్చిన భక్తులు

ఆలయం తిరిగి తెరుచుకున్నాక దర్శనం కోసం, అత్యంత పవిత్రమైనవిగా భావించే ‘అంగోదక్’ (పవిత్ర జలం) ‘అంగవస్త్ర’ (పవిత్ర వస్త్రం) స్వీకరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గువహటిలోని నీలాచల్ కొండలపై ఉన్న కామాఖ్య ఆలయం భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
‘అంబుబాచి మేళా’.. తెరుచుకున్న కామాఖ్య ఆలయం
అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయం తలుపులు నేడు ఉదయం తిరిగి తెరుచుకున్నాయి. వార్షిక ‘అంబుబాచి మేళా’ సందర్భంగా అమ్మవారు రజస్వల అయ్యే మూడు రోజులు ఆలయ గర్భగుడిని పూర్తిగా మూసేశారు. నేడు ఆలయం మళ్లీ తెరవడంతో అమ్మవారి ప్రత్యేక… pic.twitter.com/HP5FNJ1aHj
— Akshara Today | Telugu News (@aksharatoday) June 26, 2026
ఇది కూడా చదవండి..: Antyodaya Anna Yojana | కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ విధానంలో ఇకపై కొత్త రూల్స్