Guru Purnima 2026 | గురు పూర్ణిమ 2026.. పర్వదిన విశిష్టత, పూజా ముహుర్తాలు ఇవే!

హిందూ సంప్రదాయంలో పౌర్ణమి తిథికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు గురువులకు ఎంతో ప్రత్యేకం.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Guru Purnima 2026 | హిందూ సంప్రదాయంలో పౌర్ణమి తిథికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు గురువులకు ఎంతో ప్రత్యేకం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు ( Veda Vyasa ) గురు పూర్ణిమ రోజే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి మానవాళికి జ్ఞానాన్ని అందించిన మహాగురువుగా పూజిస్తారు. అందుకే ఆయన జయంతిని ‘గురు పూర్ణిమ’గా జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో గురు బలం మెరుగ్గా ఉండాలన్నా, గురువుల ఆశీస్సులు పొందాలన్నా ఈ రోజు చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

Guru Purnima 2026 | గురు పూర్ణిమ తేదీ, సమయం..

ఈ ఏడాది జులై 28వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6:18 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. జులై 29వ తేదీ (బుధవారం) రాత్రి 8:05 గంటలకు ఇది ముగుస్తుంది. సూర్యోదయ ఉదయ తిథి ప్రకారం జూలై 29న బుధవారం రోజు గురు పూర్ణిమ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శివయ్యను భక్తులు ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

పూజా ముహుర్తాలు:

బ్రహ్మ ముహుర్తం: తెల్లవారుజామున 4:17 నుంచి 4:59 వరకు

అమృత ఘడియలు: ఉదయం 7:22 నుంచి 9:04 వరకు

శుభ ముహుర్తం: ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు

లాభ ముహుర్తం: సాయంత్రం 5:32 నుంచి 7:14 వరకు

ఈ పవిత్ర సమయాల్లో నదీ స్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.

Guru Purnima 2026 | పూజా విధానం..

గురు పూర్ణిమ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవితో పాటు వేద వ్యాస మహర్షిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. ఈ రోజున తమకు విద్యను, మార్గదర్శకత్వాన్ని అందించిన గురువులను స్మరించుకుని పూజించాలి. సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. చాలా మంది ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించి, వైవాహిక జీవితంలోని సమస్యల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటారు.

Guru Purnima 2026 | గురు పూర్ణిమ ప్రాముఖ్యత..

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు అత్యున్నత స్థానం ఉంది. గురువు మార్గదర్శకత్వంలో ప్రతి ఒక్కరి జీవితం మెరుగవుతుంది. గురు పూర్ణిమ రోజే ఆదియోగి శివుడు తన మొదటి జ్ఞానాన్ని సప్తఋషులకు పంచాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అలాగే బౌద్ధ మతంలోనూ గౌతమ బుద్ధుడు ఈ పవిత్ర రోజునే తన మొదటి ప్రసంగాన్ని అందించినట్లు చారిత్రక నేపథ్యం ఉంది.

ఇది కూడా చదవండి:  Uday Krishna Reddy Arrest | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *