Telangana Weather | నేడు పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్​

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Weather | ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ ( Telangana)లోని జిల్లాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ, పశ్చిమ తెలంగాణలో అక్కడక్కడా మోస్తసు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ – మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మోస్తసు వర్షం కురిసే అవకాశం ఉంది.

వానాకాలం ప్రారంభం అయి నెల రోజులు కావొస్తున్నా భారీ వర్షాలు పడటం లేదు. జూన్​ 8న తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అనంతరం అవి బలహీనపడ్డాయి. ఆలస్యంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో అడపదడపా వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Telangana Weather | సాగుపై ప్రభావం

Telangana Weather

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో బోరుబావుల కింద వరినాట్లు ప్రారంభం అయ్యాయి. అయితే ఎల్​నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ​ అధికారులు తెలిపారు. జూన్​ ముగింపునకు వచ్చినా ఇప్పటికి.. భారీ వర్షాలు పడలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారి వర్షాలు పడకపోతే వరి సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Podu Farmers Protest | ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *