NHM Employees Issues | ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: NHM Employees Issues | ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కలెక్టరేట్ లో సమావేశానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు కలిశారు.

NHM Employees Issues | ఆరోగ్యశాఖా మంత్రితో ..

తాము సమ్మె చేస్తున్న ఉద్దేశ్యాన్ని షబ్బీర్ ఆలీకి ఎన్​హెచ్​ఎం ఉద్యోగులు వివరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన షబ్బీర్ అలీ (Shabbir Ali) వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చిస్తానని తెలిపారు. డిమాండ్ల సాధనకు కృషి చేస్తానన్నారు. ఎన్​హెచ్ఎం ఉద్యోగులు మాట్లాడుతూ.. చాలాకాలంగా సమాన పనికి సమాన వేతనం, జాబ్ సెక్యూరిటీ, పెండింగ్ జీతాలు, ఆరోగ్య భద్రత తదితర డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నట్టుగా తెలిపారు. సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతరాయం కలుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు హామీతో ఉద్యోగులు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తూ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Prashanth Reddy Sports | చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి.. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *