అక్షరటుడే, బాన్సువాడ: Revanth Reddy Complaint | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వారు మంగళవారం బాన్సువాడ(Banswada) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Revanth Reddy Complaint | సీఎం పదవిలో ఉండి..
రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో కొనసాగుతున్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రజల్లో ఉద్రిక్తతలకు దారితీసేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు హింసను ప్రేరేపించేలా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, సీఎం వ్యాఖ్యలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, ఎర్రవట్టి సాయిబాబా, కౌన్సిలర్ మక్బూల్, మాజీ వార్డు సభ్యులు శ్రీను, అక్బర్, ఫిరోజ్, ఖలీల్, మోచి గణేష్, రమేష్ యాదవ్, చాకలి సాయిలు, శివ సూరి, రహీం తదితరులు పాల్గొన్నారు.