Ketan Agarwal Murder | ప్రధాని మోదీకి కేతన్ తల్లి లేఖ

పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ketan Agarwal Murder | పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై బాధితుడి తల్లి రాఖీ అగర్వాల్ స్పందిస్తూ, తన కుమారుడికి న్యాయం చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ( Narendra modi ) వేదనతో కూడిన లేఖ రాశారు. తమ సంతోషకరమైన ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైందని రాఖీ అగర్వాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. “నా బిడ్డ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ దురదృష్టవశాత్తూ అతనికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి మాకు ఎదురైంది. తన అకాల మరణంతో మా ప్రపంచం శూన్యమైంది. ఇంట్లో ఎటు చూసినా కేతన్ జ్ఞాపకాలు మమ్మల్ని వేధిస్తున్నాయి. ఈ తీరని విషాదాన్ని భరించలేక మా కుటుంబంలో మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు” అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

Ketan Agarwal Murder | న్యాయం కోసం వేడుకోలు..

ఒక తల్లిగా తనకు కావాల్సింది కేవలం న్యాయమని, దోషులకు చట్టపరంగా కఠిన శిక్ష పడాలని ఆమె ప్రధానిని కోరారు. న్యాయం జరగడంలో ఆలస్యం జరిగే కొద్దీ తమ గుండెకోత అంతకంతకూ పెరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్ ఇక తిరిగిరాడనే చేదు నిజాన్ని తాము అంగీకరించగలమని, కానీ ఆ ఘాతుకానికి పాల్పడిన నిందితులను మాత్రం వదిలిపెట్టకూడదని ఆమె డిమాండ్ చేశారు.

Ketan Agarwal Murder | కేసులో పురోగతి..

ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియాతో పాటు, ఆమె ప్రియుడు చేతన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై పుణెలోని స్థానికులు, వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేసి, నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Revanth Reddy Complaint | సీఎం రేవంత్ రెడ్డిపై బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *