అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Illegal sand transportation | ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ (District Collector) ఇలా త్రిపాఠి కఠినంగా (Collector Ila Tripathi) వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై వేటు వేస్తున్నారు.
Illegal sand transportation | మెండోరా ఆర్ఐ సస్పెన్షన్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట ఇసుకను అక్రమంగా దారి మళ్లించాడనే ఫిర్యాదు మేరకు మెండోరా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) సదానంద్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు గట్టి నిఘా కొనసాగిస్తున్న విషయం విదితమే. ‘మన ఇసుక వాహనం’ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే ఇసుక తరలింపునకు అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సదానంద్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట ఇసుక తరలింపునకు అనుమతులు పొంది, ఇసుక నిల్వలను దారి మళ్లిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది.
Illegal sand transportation | విచారణ చేయించగా బయటపడ్డ అక్రమాలు..
ఈ విషయమై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను సైతం అధికారులతో వాకబు చేయించగా, తమకు ఇసుక అందలేదని వెల్లడించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, మెండోరా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సదానంద్ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుకను అక్రమంగా దారి మళ్లించడంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని మైనింగ్ ఏడీని ఆదేశించారు. ఇసుక రవాణాలో అక్రమాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: గురుగ్రామ్–ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.