TNGOs President Election | టీఎన్జీవోస్​ నిజామాబాద్​ అధ్యక్షుడిగా నాశెట్టి సుమన్​ కుమార్​

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: TNGOs President Election | టీఎన్జీవోస్​ నిజామాబాద్ ​(TNGOs Nizamabad) అధ్యక్షుడిగా నాశెట్టి సుమన్​కుమార్​ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కార్యదర్శిగా నేతికుంట శేఖర్​ సైతం ఏకగ్రీవమయ్యారు. నగరంలోని టీఎన్జీవోస్​ భవన్​లో(TNGOs Bhavan) గురువారం ఎన్నికలు నిర్వహించారు.

TNGOs President Election | అధ్యక్ష, కార్యదర్శులు ఏకగ్రీవం

టీఎన్జీవోస్​ భవన్​లో నిర్వహించిన ఎన్నికలకు వ్యవసాయ శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వనమాల సుధాకర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సహాయక ఎన్నికల అధికారిగా జాఫర్ హుస్సేన్ ఉన్నారు. అధ్యక్ష, కార్యదర్శ పదవులతో సహా అన్ని పదవులకు సింగిల్​ సెట్​ నామినేషన్​ దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా నాశెట్టి సుమన్​ కుమార్​, కార్యదర్శిగా నేతికుంట శేఖర్​ ఎన్నికయ్యారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైన ఎన్నికైన కార్యవర్గాన్ని ఘంగా సన్మానించారు. కార్యవర్గం ఏకగ్రీవం అయ్యేందుకు కృషి చేసిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

TNGOs President Election | ఉద్యోగుల వెన్నంటి ఉంటాం..

రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు నాశెట్టి సుమన్​ కుమార్​, నేతికుంట శేఖర్​ మాట్లాడుతూ.. ఉద్యోగులతో(Employees) మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. రాబోయే కాలంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై గౌరవ ఎంప్లాయీస్ జేఏసీ(Employees JAC) రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని (ముజీబ్) సహకారంతో కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారాం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, టీఎన్జీవో నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి తదితరులు హాజరయ్యారు.

TNGOs President Election |

ఇది కూడా చదవండి: Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *