Telangana Employees Transfers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత

Balla Sandeep Kumar
Spouse Transfer Issue

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Employees Transfers | తెలంగాణ రాష్ట్ర (Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. మే ఒకటో తేదీ నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. కాగా.. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు ట్రాన్స్​ఫర్స్​ (Employees Transfers)కు అర్హులని వెల్లడించింది.

Telangana Employees Transfers

Telangana Employees Transfers | వీరికి మినహాయింపు

బదిలీల్లో పలువురికి మినహాయింపు ఇచ్చింది. నాలుగేళ్లకు మించి ఏ ఉద్యోగిని కూడా ఒకేచోట కొనసాగించరాదు. అయితే 2027 మే 31వ తేదీలోపు రిటైరయ్యే ఉద్యోగులను వారి అభ్యర్థన మేరకే బదిలీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ కేడర్​లో అయినా 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ కూడదని స్పష్టం చేసింది.మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న ఉద్యోగులను వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి మాత్రమే పంపాల్సి ఉంటుంది. స్పౌజ్​ కేసులో భార్యాభర్తలలో ఒకరిని మాత్రమే బదిలీ చేయాలని పేర్కొంది. ఉద్యోగి జీవిత భాగస్వామి లేదా పిల్లలు, తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశాలకు బదిలీ చేయాలి.

ఇది కూడా చదవండి..: Kavitha on BRS Meeting | బీఆర్​ఎస్​ జగిత్యాల సభపై కవిత సంచలన వ్యాఖ్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *