తెలంగాణKavitha on BRS Meeting | బీఆర్​ఎస్​ జగిత్యాల సభపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha on BRS Meeting | బీఆర్​ఎస్​ జగిత్యాల సభపై కవిత సంచలన వ్యాఖ్యలు

జగిత్యాలలో బీఆర్​ఎస్​ నిర్వహించిన సభపై కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. తెలంగాణ వ్యతిరేకిని పార్టీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha on BRS Meeting | బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ (KCR)​ సోమవారం జగిత్యాలలో సభ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సభలో మాజీ మంత్రి జీవన్​రెడ్డి (Former Minister Jeevan Reddy) గులాబీ పార్టీలోకి చేరారు. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకిని పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు.

కవిత మంగళవారం మీడియాతో మాట్లాడారు. జగిత్యాల (Jagtial)లో బీఆర్​ఎస్​ సభపై సెటైర్లు వేశారు. తాము కొత్తగా పెట్టబోయే పార్టీలో యువతకు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. బీఆర్​ఎస్​ సభలో కేంద్ర ప్రభుత్వంపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. మహిళా రిజర్వేషన్​, డీలిమిటేషన్​ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాని గురించి కనీసం ప్రస్తావించలదేని విమర్శించారు. బీఆర్​ఎస్​లో ఆడబిడ్డలకు గౌరవం ఉండదన్నారు.

Kavitha on BRS Meeting | బీఆర్​ఎస్​ మారదు

బీఆర్​ఎస్​ నాయకులు తమ ఓటమికి ప్రజలను తప్పు పడుతున్నారని ఆరోపించారు. జీవన్​రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అన్నారు. అలాంటి వారిని రాజకీయ పునరేకీకరణ పేరు చెప్పి అలాంటి వారిని బీఆర్​ఎస్​ (BRS)లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. వెయ్యి ఏళ్లు అయిన ఆ పార్టీ మారదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుల గురించి బీఆర్​ఎస్​ సభలో ఒక్క మాట లేదన్నారు.

Kavitha on BRS Meeting | సీఎంపై విమర్శలు

హరీశ్​రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనపై మాట్లాడుతూ.. గుంటనక్క ఢిల్లీకి వెళ్లారన్నారు. దీనిపై గుంపు మేస్త్రీ మాట్లాడుతూ.. ఆయన ఎందుకోసం వెళ్లారో తనకు తెలుసు అంటున్నారని, అలాంటప్పుడు ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైతు భరోసా సీజన్​ అయిపోయిన తర్వాత వేశారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉంటామని రేవంత్​ రెడ్డి చెబుతున్నారని, ఎలా ఉంటారని ప్రశ్నించారు. హామీలు అమలు చేయనందుకు అధికారంలో ఉంటారా అని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, అదే తోవలో కాంగ్రెస్​ సైతం వెళ్తుందని విమర్శించారు.

Kavitha on BRS Meeting

Kavitha on BRS Meeting | ఆశీర్వదించండి

జాగృతి సంస్థగా ఉన్న తాము ఈ నెల 25న రాజకీయ పార్టీగా మారబోతున్నట్లు కవిత (Kavitha) తెలిపారు. మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లో జరిగే ఈ సమావేశానికి ప్రజలు తరలి రావాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి తాము కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త తరహా రాజకీయలు చేస్తామన్నారు. ఆడబిడ్డగా వస్తున్నానని ఆశీర్వాదించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Chandrababu Comments | రేవంత్​రెడ్డికి అవగాహన లేదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...