అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chandrababu Comments | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి డీలిమిటేషన్‌పై అవగాహన లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి, స్టాలిన్ అవగాహన లేకుండా.. దక్షిణాదికి నష్టం అని ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు.
చంద్రబాబు రెండో రోజు తమిళనాడు ఎన్నికల (Tamilnadu Elections) ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఏం నష్టం జరుగుతుందో చెప్పాలన్నారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకొని ఏం సాధించారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీలిమిటేషన్ (Delimitation)కు ఇదే మంచి ఫార్ములా అన్నారు. దక్షిణాదిలో జనాభా తగ్గిందని, తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం ఎలా జరుగుతుందో కాంగ్రెస్, డీఎంకే చెప్పాలన్నారు.

Chandrababu Comments | మోదీ ఎవరికి తలొగ్గరు
కేంద్రంలో మోదీ (PM Modi) నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉందని చంద్రబాబు అన్నారు. ఆయన ఎవరికీ సరెండర్ కారన్నారు. మోదీకి దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. తమిళనాడు, ఆంధ్ర వేర్వేరు కాదని బాబు అన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి తమకు తమిళనాడు (Tamilnadu)తో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. అప్పుడే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. సమర్థులను ఎన్నుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి..: Case on Ambati Rambabu | గుంటూరులో అంబటి రాంబాబుపై మరో కేసు.. నిరసన దీక్షపై పోలీసుల చర్యలు