తెలంగాణT-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ...

T-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్‌ను పటిష్టం చేయడంలో భాగంగా టీ-శాట్ సేవలను విద్యార్థులకు మరింత చేరువ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యా విధానంలో చేపడుతున్న సంస్కరణల్లో భాగంగానే ఈ బదిలీ ప్రక్రియ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: T-SAT Education Department | తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ నెట్‌వర్క్ ‘టీ-శాట్’ (T-SAT) నిర్వహణలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) & కమ్యూనికేషన్ శాఖ కింద ఉన్న టీ-శాట్ సబ్జెక్టును విద్యాశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సర్కారు స్పష్టం చేసింది.

T-SAT Education Department | సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని..

దశాబ్ద కాలంగా ఐటీ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్న టీ-శాట్ ఛానెళ్లను (విద్యా, నిపుణ), విద్యావ్యవస్థలో మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాఠశాల, ఇంటర్మీడియట్ మరియు ఉన్నత విద్యా విభాగాలకు సంబంధించిన పాఠ్యాంశాల ప్రసారాలు, అభ్యర్థులకు శిక్షణ వంటి అంశాలు నేరుగా విద్యాశాఖ పరిధిలో ఉండటం వల్ల సమన్వయం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

T-SAT Education Department | కీలక మార్పులు

టీ-శాట్ నెట్‌వర్క్ ఇకపై విద్యాశాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అంశాలపై విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్‌ను పటిష్టం చేయడంలో భాగంగా టీ-శాట్ సేవలను విద్యార్థులకు మరింత చేరువ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యా విధానంలో చేపడుతున్న సంస్కరణల్లో భాగంగానే ఈ బదిలీ ప్రక్రియ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీ-శాట్ ద్వారా అందించే విద్యా సేవలను మరింత నాణ్యంగా, శాస్త్రీయంగా రూపొందించడానికి విద్యాశాఖలోని నిపుణులు ఇకపై నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉంది.

Inter AEC Course | తెలంగాణ ఇంటర్‌లో AEC కోర్సు.. ప్రభుత్వం, అనుబంధ విద్యాసంస్థల్లో ప్రయోగాత్మకంగా అమలు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gangadhara Sub Registrar | ఏసీబీ వలలో గంగాధర ఇన్​ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రూ. 1.06 లక్షల అక్రమ వసూళ్ల కేసులో అరెస్టు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gangadhara Sub Registrar | పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్...

లక్డీకాపూల్ గ్లెనీగిల్స్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక లేబర్ సూట్ ప్రారంభం

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లెనీగిల్స్ హాస్పిటల్స్ (ఫోర్టిస్ నెట్‌వర్క్ హాస్పిటల్) మహిళల ఆరోగ్య...

Bandi Sanjay Statement | నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : బండి సంజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Statement | కేంద్ర మంత్రి...

Indalwai Checkpost Inspection | ఇందల్వాయి చెక్​పోస్ట్​ వద్ద సీపీ సాయిచైతన్య ఆకస్మిక తనిఖీలు

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Indalwai Checkpost Inspection | పశువుల అక్రమ...