అక్షరటుడే, వెబ్డెస్క్: Bhogapuram Airport | విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీ శనివారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ఈ ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సేవలు అందించనుంది. పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ కోడ్ (VTZ) మీదుగానే కొత్త విమానాశ్రయం సేవలు కొనసాగుతాయి.
Bhogapuram Airport | విమాన సర్వీసులు..
ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌కు రోజూ 5, బెంగళూరుకు 2, విజయవాడకు 4 విమాన సర్వీసులు నడవనున్నాయి. విశాఖ–సింగపూర్ మధ్య వారానికి 3 రోజులుగా ఉన్న ‘స్కూట్’ ఎయిర్ సర్వీసులు ఆగస్టు 17 నుంచి 4 రోజులకు పెరగనున్నాయి. అలాగే అబుదాబీకి కూడా విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Bhogapuram Airport | ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం..
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారనుంది. దేశీయ, విదేశీ కనెక్టివిటీ పెరగడం ద్వారా పర్యాటకం, ఐటీ, వాణిజ్యం , పారిశ్రామిక రంగాలు మరింత పురోగతి సాధిస్తాయని అధికారులు భావిస్తున్నారు. వచ్చే 30 సంవత్సరాల పాటు షెడ్యూల్డ్ విమానాలన్నీ ఈ ఎయిర్‌పోర్ట్ నుంచే రాకపోకలు సాగిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చదవండి..: Modi Andhra Pradesh Visit | ఏపీలో పర్యటించనున్న ప్రధాని.. భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించనున్న మోదీ