అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Microsoft Market Value | అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అదరగొడుతూ స్టాక్ మార్కెట్ (Stock Market) చరిత్రను తిరగరాసింది. గురువారం నాటి ట్రేడింగ్ లో మైక్రోసాఫ్ట్ షేర్లు రికార్డ్ స్థాయిలో 16 శాతం లాభపడ్డాయి. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో ఆ కంపెనీ సంపద ఒక్కరోజులోనే 450 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.42 లక్షల కోట్లు) పెరిగింది. ఒక కంపెనీ మార్కెట్ వాల్యూ ఒక్క రోజులోనే ఈ స్థాయిలో పెరగడం వాల్‌స్ట్రీట్ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. కాగా మైక్రోసాఫ్ట్ షేరు విలువ ఒక రోజులో ఈ స్థాయిలో పెరగడం 2008 తర్వాత ఇదే మొదటిసారి.
Microsoft Market Value | త్రైమాసిక ఫలితాల ప్రభావం
మైక్రోసాఫ్ట్ కంపెనీ రెండు రోజుల క్రితం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అజ్యూర్ క్లౌడ్ విభాగంలో ఆదాయం అంచనాలకు మించింది. ఈ విభాగంలో 43 శాతం వృద్ధి నమోదుచేసినట్లు కంపెనీ వెల్లడించింది. తమ ఏఐ అసిస్టెంట్ మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌కు విశేషమైన ఆదరణ లభిస్తోందని, దీని యÖజర్ల సంఖ్య 3 కోట్లు దాటిందని పేర్కొనడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని బలపరిచింది. దీంతో కంపెనీ షేర్లు ర్యాలీ తీశాయి.
Microsoft Market Value | ఎన్వీడియా రికార్డు బద్దలు..
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గతేడాది 2025 ఏప్రిల్‌లో ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ఎన్వీడియా బాగా లాభపడింది. ఆ కంపెనీ షేర్లు రాణించడంతో మార్కెట్ విలువ ఒక్కరోజే 440 బిలియన్ డాలర్లు పెరిగింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది రికార్డు. ఆ రికార్డును ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బద్దలు కొట్టింది.
ఇది కూడా చదవండి..: KOSPI Index | మిసైళ్లా దూసుకెళ్లిన కోస్పీ.. ఒక్కరోజే 18 శాతం పెరిగిన సూచీ