అక్షరటుడే, వెబ్‌డెస్క్: KOSPI Index | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఆధారిత కంపెనీలలో ప్రాఫిట్ బుకింగ్‌తో దక్షిణకొరియాకు చెందిన స్టాక్ మార్కెట్ నెల రోజులుగా కుదుపులకు లోనవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 40 శాతానికిపైగా నష్టపోయింది. ఈ వారంలో వరుసగా రెండు సెషన్లలో 20 శాతానికిపైగా నష్టపోవడంతో ట్రేడింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఈ వారంలో వరుసగా మూడు రోజులు నష్టాలను చవిచూసింది.
KOSPI Index | ఒక్కసారిగా పుంజుకుని..
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్టాక్స్‌లో ర్యాలీ ఊపందుకుంది. ఎస్కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ రాణించడంతో ఒక్కరోజులో కోస్పీ రికార్డు స్థాయిలో పెరిగింది. శుక్రవారం ఇంట్రాడేలో 18 శాతానికిపైగా పైకి ఎగసిం ఒక్కరోజులో సరికొత్త రికార్డు సృష్టించింది. చిప్మేకర్లు లాభాలకు నాయకత్వం వహించాయి. ఎస్కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చెరో 23 శాతానికి పైగా పెరగడం గమనార్హం. తైవాన్ సెమీకండక్టర్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా 10 శాతానికి పైగా లాభపడింది.
ఇది కూడా చదవండి..: Indian Stock Market | మూడో రోజూ లాభాల్లోనే..