Adilabad Armur Railway Line | ఆదిలాబాద్, ఆర్మూర్ రైల్వే లైన్​కు డీపీఆర్​ పూర్తి

ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్​కు డీపీఆర్​ పూర్తయిందని.. త్వరలోనే అప్రూవల్​కు పంపనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్/ఇందూరు : Adilabad Armur Railway Line | ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్​కు డీపీఆర్​ పూర్తయిందని.. త్వరలోనే అప్రూవల్​కు పంపనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. తనను కలిసిన తెలంగాణ ఎంపీలతో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు.

Adilabad Armur Railway Line | తెలంగాణలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులు..

అశ్విని వైష్ణవ్‌ను తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, కొత్త రైల్వే మార్గాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన నిధులు మంజూరు చేసి చర్యలు చేపట్టాలని ప్రతినిధి బృందం కోరింది. ఈ అంశాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

Adilabad Armur Railway Line | నగరంలో పలు వంతెనల నిర్మాణానికి..

నగరంలోని పలు వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ కోరారు. ఎంపీ అర్వింద్​తో కలిసి ఢిల్లీలో మంత్రిని కలిశారు. ప్రతిపాదనలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీ రోడ్డు-నాందేవ్​వాడ (ఆర్​వోబీ) అదనపు వంతెన మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రధానంగా ఈ రైల్వే లైన్​ దాటడానికి విజయ థియేటర్, అలాగే నాందేవ్​వాడ వద్ద రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. రద్దీ ఎక్కువగా కావడంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదని, కావున నూతన ఆర్​వోబీ మంజూరు చేయాలన్నారు. అలాగే ఎల్లమ్మగుట్ట వద్ద సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో మరొక ఆర్​యూబీ అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం రూ.170 కోట్లు మంజూరుకావాలన్నారు. సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్​, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement | విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment
  • ఇదే మాట కొన్ని ఏళ్ల నుంచి చెబుతున్నారు
    అది వచ్చింది లేదు, నిర్మల్ అభివృద్ధి చెందింది లేదు ఉపాధి దొరుకుతుందన్న ప్రజల ఆశ ఇంకా కలగానే మిగిలిపోయింది
    రాజకీయంలో మార్పు వస్తుంది,
    రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది గాని
    యువతకు ఉపాధి లేదు
    ప్రజల్లో ఎటువంటి అభివృద్ధి లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *