Fee Reimbursement | విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు..

విద్యార్థుల భవిష్యత్తుతో చేలగాటమాడితే సహించేది లేదని బీజేవైఎం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Fee Reimbursement | విద్యార్థుల భవిష్యత్తుతో చేలగాటమాడితే సహించేది లేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్​ పేర్కొన్నారు. ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం అయ్యారు.

Fee Reimbursement | మిస్డ్​ కాల్, క్యూఆర్​ కోడ్​ ద్వారా..

ఈ సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మిస్డ్​ కాల్, క్యూఆర్​ కోడ్​ ద్వారా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వంశీ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయీంబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫీజులు చెల్లించలేక వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, కొంతమంది అప్పులు చేసి చదువులు కొనసాగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ ఉద్యమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందులు బాలు, బీజేవైఎం ఆర్మూర్ రూరల్ మండల్ అధ్యక్షుడు సతీష్ బబ్లూ, కలిగోట్ ప్రశాంత్, భరత్​, నిఖిల్, వంశీ, రాజు, హర్ష, శీను, గిరి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Online Investment Scam | ‘ఆన్​లైన్’​లో అధిక వడ్డీ పేరుతో మోసం.. ఏడువేలకు పైగా అమాయకులను బురిడీ కొట్టించిన యువకుడు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *