Mobile Recovery | మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి రాష్ట్రానికే ఆదర్శం: ఎస్పీ రాజేష్ చంద్ర

మొబైలో రికవరీలో కామారెడ్డి జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. 30 రోజుల్లో 159 ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని గురువారం అభినందించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Mobile Recovery | మొబైల్​ ఫోన్ల రికవరీలో కామారెడ్డి(Kamareddy) జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని ఎస్పీ రాజేష్ చంద్ర(rajesh chandra sp) అన్నారు. గడిచిన 30 రోజుల్లో 159 ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని గురువారం  అభినందించారు.

Mobile Recovery | సీఈఐఆర్​ పోర్టల్​తో..

ఎస్పీ మాట్లాడుతూ.. పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్(CEIR portal) ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించడంలో జిల్లా పోలీస్ శాఖ( kamareddy police) రాష్ట్రంలోనే ముందంజలో నిలిచిందన్నారు. ప్రతినెలా 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.05 కోట్ల విలువైన 658 ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించామని చెప్పారు.  మొబైల్ రికవరీ కోసం ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగించి గత 30 రోజుల్లోనే రూ.25.44 లక్షల విలువైన 159 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిందన్నారు. గత ఏడాది సైతం రూ.3 కోట్ల విలువైన 1,834 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన ఘనత కామారెడ్డి పోలీసులదని పేర్కొన్నారు.

Mobile Recovery | డిజిటల్​ యుగంలో..

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫొటోలు, కీలకమైన డేటా నిక్షిప్తమయ్యే అత్యంత ముఖ్యమైన పరికరమని ఎస్పీ పేర్కొన్నారు. ఫోన్ పోగొట్టుకోవడంతో వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అందుకే రికవరీపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే కాలయాపన చేయకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,939 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి, .7.90 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు విజయవంతంగా అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని ఆయన అభినందించారు.

ఇది కూడా చదవండి:  Mini Countryman C | స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో.. బీఎండబ్ల్యూ నుంచి ప్రీమియం కారు లాంచ్

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *