Dhanpal Surya Narayana | కాక్రోజ్.. దేశ ద్రోహుల పార్టీ : ఎమ్మెల్యే ధన్​పాల్​

సీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహానికి పాల్పడినట్టేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Dhanpal Surya Narayana | కాక్రోజ్ పార్టీకి (Cockroach Party) మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహానికి పాల్పడినట్టేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు. ప్రధాని (PM Modi) నివాసం వద్ద అరాచకం సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Dhanpal Surya Narayana | కాంగ్రెస్​ పార్టీది అరాచకం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒకప్పుడు ఆప్ పార్టీ సోషల్ మీడియా వలంటీర్​గా పనిచేశాడని గుర్తు చేశారు. ప్రధాని మోదీ భారత్​ను ప్రపంచ దేశాల్లో అగ్రస్థానానికి తీసుకొచ్చేందుకు కష్టపడుతుండగా.. కాంగ్రెస్​ మాత్రం అధికారం కోసం అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్న నాయకులంతా దేశద్రోహులేనని ధ్వజమెత్తారు. దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్​ గతంలో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడంతో, ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైందని గుర్తు చేశారు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపే ప్రతిఒక్కరూ బంగ్లాదేశ్​, పాకిస్తాన్​కు మద్దతు తెలిపినట్లేనన్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, అద్దంకి దయాకర్, ప్రకాష్ రాజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది హిందూ వ్యతిరేకులు ఏకమవుతున్నారని చెప్పారు.

Dhanpal Surya Narayana | నీట్​ పరీక్ష పేరుతో..

నీట్ పరీక్ష పేరుతో ఢిల్లీలో అరాచకం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. నీట్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా ఉందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. విద్యార్థుల పాఠ్యాంశాల్లో అక్బర్, ఔరంగజేబు వంటి వారి చరిత్రను తొలగించినందుకా అని అన్నారు. అంతకు ముందు పోలీసులు దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో కొంతసేపు తోపులాట జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బెల్లాల్ శశాంక్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

mla mla1

ఇది కూడా చదవండి: Sharad Pawar Modi Meeting | పార్లమెంట్‌లో నిరసనల వేళ.. ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *