Stock Market Loss | మూడో రోజూ నష్టాలే..

దేశయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 715 పాయింట్లు, నిఫ్టీ 191 పాయింట్లు పతనమయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Loss | అమెరికా -ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ముడి చమురు బ్యారెల్ ధర 94 డాలర్లకు చేరుకుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జనరిక్ మందులపై ట్రంప్ కొత్త టారిఫ్ బెదిరింపులు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ అన్ని రంగాలలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. మూడు సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 1,400 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకుపైగా నష్టపోయాయి.

Stock Market Loss | రోజంతా నష్టాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 86 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 743 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగినా.. అక్కడినుంచి 205 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టంతో 76,755 వద్ద, నిఫ్టీ 191 పాయింట్ల నష్టంతో 23,996 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,458 కంపెనీలు లాభపడగా 2,780 స్టాక్స్ నష్టపోయాయి. 180 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 114 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 100 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్ లాభపడగా.. 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్యూఎల్ 0.75 శాతం, ఎన్టీపీసీ 0.59 శాతం, పవర్‌గ్రిడ్ 0.58 శాతం, టైటాన్ 0.38 శాతం, ఎయిర్‌టెల్ 0.08 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇండిగో 3.57 శాతం, ఇన్ఫోసిస్ 1.97 శాతం, ఎస్బీఐ 1.81 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.80 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.50 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: LIC Unclaimed Funds | ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ అన్‌క్లెయిమ్డ్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *