Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఆంక్షల కారణంగా చమురు దిగుమతులకు తీవ్ర ఆటంకాలు కూడా ఏర్పడుతున్నాయి.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. మన దేశంలో చాలాకాలం చమురు కంపెనీలే ఆ భారాన్ని భరించాయి. అయితే ఇటీవల రెండుసార్లు స్వల్పంగా ఇంధన ధరలను పెంచాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ ఇలాగే కొనసాగితే మన దేశ ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది.

Oil Tankers in Hormuz  | హార్ముజ్ ద్వారానే అత్యధిక దిగుమతులు..

మన దేశం ఎక్కువగా హార్ముజ్ జలసంధి మీదుగానే క్రూడ్ ఆయిల్ (Crude Oil), గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. దేశీయ అవసరాలకు సంబంధించిన ముడి చమురులో దాదాపు 40 శాతం ఈ జలసంధి నుంచే వస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కారణంగా రవాణాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతుండడం, ధరల పెరుగుదల కారణంగా దిగుమతుల భారం పెరిగింది.

Oil Tankers in Hormuz  | కేంద్రం సంచలన నిర్ణయం..

ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఒమన్‌తో జరిపిన దౌత్య చర్చల అనంతరం.. ప్రభుత్వ రంగానికి చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన సూపర్ ట్యాంకర్లను హార్ముజ్ జలసంధిలోకి పంపేందుకు సిద్ధం చేసింది. ఇండియన్ నేవీ రక్షణ నడుమ ఈ నౌకలు భారత దేశానికి ముడి చమురును తీసుకురానున్నాయి. దీనికి సంబంధించిన ప్రణాళిక ఖరారైనట్లు తెలుస్తోంది. నౌకాదళం నుంచి అనుమతులు రాగానే సూపర్ ట్యాంకర్లు గల్ఫ్ దేశాల నుంచి ఇంధనాన్ని లోడ్ చేసుకుంటాయని భావిస్తున్నారు.

Oil Tankers in Hormuz  | భారీ రిస్క్.. అయినా..!

ఇరాన్, అమెరికా దేశాలు హార్ముజ్ జలసంధిపై విడివిడిగా ఆంక్షలు విధిస్తుండడంతో ఇబ్బందికర వాతావరణం నెలకొని ఉంది. కాగా ఇరాన్ తమతో యుద్ధం చేయని దేశాల నౌకలను అనుమతిస్తామని ప్రకటించింది. అయినప్పటికీ అక్కడ భద్రత గ్యారంటీ లేకపోవడంతో భారత ఆయిల్ కంపెనీలు ఇప్పటివరకు వెనకడుగు వేశాయి. ఇప్పుడు ట్యాంకర్లకు రక్షణగా ఇండియన్ నెవీ యుద్ధ నౌకలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి గుండా నౌకలను పంపడం భారీ రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ దేశీయంగా ఇంధన ధరలు పెరగకుండా నియంత్రించాలంటే ప్రభుత్వానికి ఇదొక్కటే మార్గంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహం విజయవంతమైతే మన ఆయిల్, గ్యాస్ కష్టాలు తీరే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: 11,000-Carat Rare Ruby Discovered in Mogok | “రక్తపు వెలుగులీనిన వెదజల్లిన రత్నాల గడ్డ” – మోగక్‌లో 11,000 క్యారెట్ల అరుదైన మహా కెంపు వెలుగు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *