అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jharkhand Assembly Protest | జార్ఖండ్‌లో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి భారీగా తరలి వచ్చారు. రాంచీలో వారు ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జార్ఖండ్ JPSC-JSSC పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు, నిరుద్యోగులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా యువత తరలి వచ్చారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో మాట్లాడుతూ.. నిరాహార దీక్షలో ఉన్నప్పటికీ తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. వారు తమను అడ్డుకోలేరన్నారు. ‘‘నేను అంబులెన్స్‌లో ఇక్కడికి చేరుకున్నాను, ఇప్పుడు స్ట్రెచర్‌పై ముందుకు సాగుతున్నాను. గత 9 రోజులుగా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను, ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించక తప్పదు.” అన్నారు.
Jharkhand Assembly Protest | అడ్డుకున్న పోలీసులు
విద్యార్థులు పోలీసుల బారికేడ్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా విధానసభ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. JSSC-CGL పరీక్షను రద్దు చేయాలని, దీనిపై CBI విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Jharkhand Assembly Protest | ఎక్కడికక్కడ తనిఖీలు
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో జార్ఖండ్ పోలీసులు ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకున్నారు. రాంచీకి వచ్చే మార్గాల్లో తనిఖీలు చేశారు. బస్సులను ఆపి వేశారు. విద్యార్థులు ఇక్కడికి చేరుకోకుండా ఉండేందుకు బైక్‌లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Jharkhand Protest: झारखंड में परीक्षा के विरोध-प्रदर्शन से जुड़ी बड़ी खबर
रांची में प्रदर्शनकारियों ने बैरिकेड हटा दिए हैं और वे विधानसभा की ओर बढ़ रहे हैं.#Jharkhand #Ranchi #RanchiNews #JPSC #JPSCStudentProtest #JharkhandProtest #RanchiProtest | Hemant Soren pic.twitter.com/lxK2NNobIv
— Shailendra Singh (@Shailendra97S) August 10, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad car accident | హైదరాబాద్‌లో కారు బీభత్సం