అక్షరటుడే వెబ్‌డెస్క్: CaptiveCrunch Attack | ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేసేవాళ్లు, హోటళ్లలో వసతి పొందేవాళ్లను టార్గెట్ చేస్తూ భారీ సైబర్ దాడులు జరుగుతున్నాయని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం గట్టి హెచ్చరిక జారీ చేసింది. పబ్లిక్ అలాగే హోటళ్ల వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతున్న ఈ ఇంటర్నెట్ హైజాకింగ్ దాడికి ‘క్యాప్టివ్‌క్రంచ్’ (CaptiveCrunch) అని పేరుపెట్టారు. ఈ ప్రమాదకరమైన హ్యాకింగ్ వెనుక రష్యాకు చెందిన ‘మిడ్నైట్ బ్లిజార్డ్’ (స్టార్మ్-2945) అనే హ్యాకింగ్ గ్రూప్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
CaptiveCrunch Attack | స్క్రీన్, ఆడియో రికార్డింగ్ ప్రమాదం..
ఈ సైబర్ దాడులు చాలా ప్రమాదకరంగా మారాయని మైక్రోసాఫ్ట్ ( Microsoft )తెలిపింది. హోటళ్లు, ఎయిర్‌పోర్టులు, కాన్ఫరెన్స్ సెంటర్లలో ఉచిత వైఫైకి కనెక్ట్ అవగానే హ్యాకర్లు ఆ డివైజ్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఈ మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశించగానే యూజర్ స్క్రీన్‌ను రికార్డ్ చేయడం, ఆడియో-వీడియో సంభాషణలను వినడం, స్క్రీన్షాట్లు తీయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా, కీబోర్డ్‌పై టైప్ చేసే ప్రతి అక్షరం, బ్రౌజర్లో సేవ్ చేసిన పాస్వర్డ్లు, మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ వివరాలు నేరుగా హ్యాకర్ల చేతికి చిక్కుతున్నాయి.
CaptiveCrunch Attack | నకిలీ నోటిఫికేషన్లతో మోసాలు..
బ్రౌజర్ అప్డేట్ చేయండి, విండోస్ సెక్యూరిటీ స్కాన్ చేయండి లేదా గూగుల్ సెక్యూరిటీ చెక్ పూర్తయింది అంటూ నకిలీ పాప్-అప్‌లను చూపించి, యూజర్ల చేత హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఒకసారి ఈ మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశిస్తే.. కీబోర్డ్ టైపింగ్‌ను రికార్డ్ చేయడం, ఆడియో-వీడియో రికార్డింగ్, పాస్వర్డ్లు , బ్రౌజర్ కుకీలను దొంగిలించడంతో పాటు కంప్యూటర్ను రిమోట్‌గా ఆపరేట్ చేసే పూర్తి అధికారాన్ని హ్యాకర్లు పొందుతారు.
CaptiveCrunch Attack | తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వీలైనంత వరకు హోటళ్లు , పబ్లిక్ ప్రదేశాల్లోని ఉచిత వైఫైని ఉపయోగించకపోవడం మంచిది. పబ్లిక్ నెట్‌వర్క్‌లకు బదులుగా వ్యక్తిగత మొబైల్ హాట్‌స్పాట్ లేదా ఎన్క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్లను వాడాలి. బ్రౌజింగ్ చేసే సమయంలో వచ్చే అనుమానాస్పద పాప్-అప్ నోటిఫికేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ నెట్‌వర్క్‌లలో సున్నితమైన కార్పొరేట్ సమాచారాన్ని, బ్యాంకింగ్ ఖాతా వివరాలను ఎంటర్ చేయవద్దని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Hyderabad car accident | హైదరాబాద్‌లో కారు బీభత్సం