Hyderabad car accident | హైదరాబాద్​లో కారు బీభత్సం

హైదరాబాద్​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad car accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి పలువురిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్మీ జవాన్​ మృతి చెందాడు.

హైదర్‌షాకోట్‌లో రాంగ్​సైడ్​లో వేగంగా దూసుకొచ్చిన మహీంద్రా XUV కారు ఒక ఆర్మీ జవాన్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఆ కారు మరో ముగ్గురిని ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Hyderabad car accident | కారులో ఐదుగురు యువకులు

ప్రమాదం జరిగిన సమయంలో XUVలో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు. అతివేగం, రాంగ్​రూట్ డ్రైవింగ్​తో ఈ ప్రమాదం జరిగింది. ఈ కారు శంషాబాద్​ ప్రాంతానికి చెందిన బాబు గౌడ్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని ఎవరు నడిపారో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Punjab Gangsters Encounter | పంజాబ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు గ్యాంగ్​స్టర్లకు గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *