Birkur Food Poisoning | గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత

బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్​తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Birkur Food Poisoning | బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. రాత్రి భోజనం అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.

Birkur Food Poisoning | బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలింపు..

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై రాత్రి 11 గంటల సమయంలో అంబులెన్స్‌ల ద్వారా బాన్సువాడ (Banswada) ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ సోమవారం ఉదయం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ప్రిన్సిపాల్ శివకుమార్‌ను కలిసి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి సర్పంచ్ సూచించారు. ఫుడ్ పాయిజన్‌కు గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి..: Tadwai Bus Stand | ఆ బస్టాండ్​కు బస్సులు రావు.. ఆకతాయిలకు అడ్డాగా మారిన వైనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *