అక్షరటుడే, ఇందూరు: DSP Promotion | జిల్లాలో ఎస్బీ సీఐగా విధులు నిర్వహిస్తున్న పుప్పాల శ్రీశైలం (Puppala Srisailam)కు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను డీఎస్పీగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..
DSP Promotion | జగిత్యాల జిల్లాకు చెందిన..
జగిత్యాల జిల్లా (Jagtial District)లో జన్మించిన పుప్పాల శ్రీశైలం 1998 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. 25 ఏళ్లుగా ఆయన శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్నేళ్లుగా ఎస్బీలో సీఐగా పనిచేస్తున్నారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం డీఎస్పీగా ప్రమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే శ్రీశైలంకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kaleshwaram Verdict | కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు హర్షణీయం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్

