అక్షరటుడే, ఇందూరు: Voter List Discrepancy | కొడంగల్, బోధన్ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు విషయంలో కనిపిస్తున్న వ్యత్యాసంపై ఎన్నికల సంఘం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు.
Voter List Discrepancy | దాదాపు 7 వేల ఓట్లు తొలగించడం
సోమవారం నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ఒక ఎన్నికల ఫలితాన్నే ప్రభావితం చేసే స్థాయిలో 33,433 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడంగల్ నియోజకవర్గంలో గత సంవత్సన్నర కాలంలో కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించారని పేర్కొన్నారు. అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో మాత్రం దాదాపు 7 వేల ఓట్లు తొలగించడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
కర్ణాటకలోని సేడంలోని 11 వేల ఓట్లు కొడంగల్‌లోని 11 వేల ఓటర్ల పేర్లను పోలి ఉన్నాయని తెలిపారు. మరో 22 వేల ఓట్లు కొడంగల్‌లోనే డూప్లికేట్ ఉన్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ ఆధిత్యం తెచ్చుకున్న ఓట్లు 32 వేలని, అంటే ఒక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేంత స్థాయిలో కొడంగల్‌లో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు వివరించారు.

ఈ వ్యత్యాసం వెనుక కారణాలను ఎన్నికల సంఘం స్పష్టంగా వెల్లడించాలని కవిత కోరారు. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తోందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పందించి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, తొలగించిన ఓట్ల వివరాలు, వాటికి సంబంధించిన కారణాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Armoor SIT Probe | ఆర్మూర్‌లో వరుస ఘటనలపై ‘సిట్’ వేసి విచారణ జరపాలి