అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prajavani Complaints | ప్రజావాణి (Nizamabad Prajavani) కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన మాట్లాడారు.
Prajavani Complaints | జిల్లావ్యాప్తంగా ఫిర్యాదుదారుల నుంచి..
కలెక్టరేట్లో (Nizamabad Collectorate) సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 156 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావు తో పాటు డీఆర్వో గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్ రావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: #BreakingNews ఆరుగురి హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతి