అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Nizamabad Prajavani | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలో ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలోని సీపీ కార్యాలమంలో సోమవారం పోలీస్ ప్రజావాణి (police rajavani) కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Nizamabad Prajavani | 39 ఫిర్యాదులు..
ఈ సందర్భంగా సీపీ కార్యాలయంలో బాధితుల నుంచి 39 ఫిర్యాదులను సీపీ సాయిచైతన్య స్వీకరించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Shabad Murder Case | షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య