Nizamabad Medical College | నిజామాబాద్ మెడికల్ కళాశాలకు గుడ్​న్యూస్.. 150కి పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు..

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల మరో కీలక మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 120 నుండి 150కి పెంచుతూ నేషనల్ మెడికల్ కమిషన్ అధికారిక అనుమతి ఇచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Medical College | నిజామాబాద్ (Nizamabad) ప్రభుత్వ వైద్య కళాశాల మరో కీలక మైలురాయిని అందుకుంది. కళాశాలలో ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ (MBBS) సీట్ల సంఖ్యను 120 నుండి 150కి పెంచుతూ  (MBBS Seats) నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అధికారిక అనుమతి ఇచ్చింది.

Nizamabad Medical College | గతంలో అధికారుల బృందం తనిఖీలు..

కళాశాలలో అదనంగా మరో 30 సీట్లను పెంచాలనే ప్రతిపాదన కొన్నాళ్లుగా ఉంది. దీనికి సంబంధించి జూన్ 17వ తేదీన ఎన్ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్‌కు చెందిన నలుగురు సభ్యుల అసెస్సర్ల బృందం జిల్లాకు వచ్చేసింది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లలో ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించింది. కాలేజీలోని వసతులు, ప్రయోగశాలలు, ఆస్పత్రిలోని మౌలిక సదుపాయాలను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.

​Nizamabad Medical College | అధికారికంగా అనుమతి..

తనిఖీ నివేదిక ఆధారంగా, ఎన్ఎంసీ బోర్డు గురువారం కళాశాలలో 120సీట్లకు అదనంగా మరో 30 సీట్లను కలుపుతూ, మొత్తం 150 సీట్లకు గానూ అధికారిక అనుమతి పత్రాన్ని జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పెరిగిన సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మెడికల్​ కళాశాల ప్రిన్సిపాల్​ డాక్టర్​ కృష్ణమోహన్​ మాట్లాడుతూ.. ఎన్ఎంసీ అనుమతితో జిల్లా విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించేందుకు (Telangana Education) మరిన్ని అవకాశాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు.

ggh

ఇది కూడా చదవండి: Shabad Murder Case | షాబాద్‌ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *