అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Congress SIR Plan | ఎస్ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచేందుకు కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తమ ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆయా డివిజన్లలో ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించగా తాజాగా నగరంలో పర్యవేక్షకులు, అసెంబ్లీ కోఆర్డినేటర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Congress SIR Plan | డీసీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ (Nizamabad) డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో 60డివిజన్లకు పర్యవేక్షకలును, అసెంబ్లీ కోఆర్డినేటర్లను నియమించారు. జిల్లాలోని సీనియర్ నాయకులను సంప్రదించి వారి పర్యవేక్షణలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా డివిజన్లలో సీనియర్ నాయకుల పర్యవేక్షణలో ‘సర్’ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పర్యవేక్షకుడు గడుగు గంగాధర్‌కు శివచరణ్, మహమ్మద్ వహీద్, బంటు బలరాం సూపర్వైజర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే తాహెర్ బిన్ హందాన్‌కు ముస్తఫా అల్కాఫ్, సయ్యద్ హర్షద్, ఎండీ జియా అహ్మద్ సూపర్వైజర్లుగా ఉంటారు. కేశ వేణుకు ఆకుల శ్రీశైలం, అంతరెడ్డి విజయ్‌పాల్, అపర్ణపాటిల్ కోఆర్డినేటర్లుగా ఉంటారు. ఎం శేఖర్ గౌడ్‌కు సకినాల శివకుమార్, సర్దార్ నరేందర్ సింగ్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.
Congress SIR Plan | డాక్టర్ కవితా రెడ్డి..

అలాగే పర్యవేక్షకురాలు కవితారెడ్డికి ఆకుల వెంకటేష్(రాజు), జిల్లెల రమేష్ కోఆర్డినేటర్లుగా ఉంటారు. రామ్భూపాల్కు మల్యాల గోవర్ధన్, లావణ్య, ఆరుణ్‌కుమార్ ఉంటారు. జీవీ రామకృష్ణకు ధర్మారం అవిన్, పత్తి శోభన్ కుమార్, కోఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నరాల రత్నాకర్‌కు సయ్యద్ నవాజ్, ఇమ్రాన్ అహ్మద్, సయ్యద్ సలీంలు అసెంబ్లీ కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు. ఎండీ జావిద్ అక్రంకు సాయి బసవ మాదివర్, ఎండీ యూనుస్(ఖుద్దుస్), ఒబిద్ బిన్ హందాన్ ఉంటారు. కప్కర్ గణ్‌రాజ్ గోపరి లక్ష్మణ్, బొబ్బిలి మురళి, బండారి రమేష్‌లు బాధ్యతలు చూస్తారు.
ఇది కూడా చదవండి..: Bheemgal Oora Panduga | భీమ్‌గల్‌లో వైభవంగా ‘ఊర పండుగ’