Banakacharla Project | తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. బనకచర్ల పిటిషన్​పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Banakacharla Project | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్​ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

గోదావరి జలాలను కృష్ణా నది ద్వారా రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్​ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్​ నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఈ పిటిషన్​ నిబంధనలకు విరుద్ధంగా లిస్ట్ అయిందని కోర్టు తెలిపింది. ఒరిజినల్ సూట్ రూల్స్ ప్రకారమే విచారణ జరగాలని స్పష్టం చేసింది. ముందుగా చాంబర్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

Banakacharla Project | లోపాలు సరిచేశాకే..

Banakacharla Project

ప్రతివాదులకు నోటీసులు లేకుండానే బెంచ్ ముందుకు పిటిషన్ రావడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. అయితే ఏపీకి వెంటనే నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తిని తిరస్కరించింది. పిటిషన్​లో లోపాలు సరిదిద్దాకే విచారణ చేపడుతామని తెలిపింది. ఈ కేసులో 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే పిటిషన్​లో లోపాలు సరిదిద్దాకే మిగతా అంశాలు పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..: Albendazole Tablets | చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు వేయాలి: మంత్రి రాజనర్సింహ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *