Shabad Murder Case | షాబాద్ మర్డర్స్.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు

షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ గురించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Shabad Murder Case | షాబాద్‌లో ( Shabad )సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ గురించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తన భార్య సరిత, పిల్లలను దారుణంగా చంపడం వెనుక అతని దురలవాట్లు, అప్పుల బాధే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Shabad Murder Case | ప్రేమ వివాహం..

రాజ్ కుమార్ భార్య సరిత (33) అతనికంటే వయసులో ఆరేళ్లు పెద్దది. రాజ్ కుమార్ ఇంటర్ చదువుతున్న సమయంలో సరిత అతనికి ట్యూషన్ చెప్పే టీచర్‌గా పని చేసేది. అప్పట్లోనే ఆమెపై ప్రేమ పెంచుకున్న రాజ్ కుమార్, ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొట్టి, పట్టుబట్టి 2018లో పెళ్లి చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రాజ్ కుమార్, బెట్టింగ్‌లు, జూదానికి బానిసయ్యాడు.

Shabad Murder Case | అప్పుల ఊబి..

జూదం, మద్యం వ్యసనాల వల్ల సుమారు రూ. 2 కోట్ల వరకు అప్పులు చేసినట్లు అతని సోదరి వెల్లడించింది. అప్పుల బాధ భరించలేక గతంలో ఆత్మహత్యకు కూడా యత్నించాడు. అప్పుడు తల్లిదండ్రులు తమకున్న పొలాన్ని అమ్మి అతని అప్పులను తీర్చారు. అయినా రాజ్ కుమార్ తన ప్రవర్తన మార్చుకోలేదు. నిత్యం తాగి వచ్చి భార్య సరితను వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సరిత అతని వేధింపులు భరించలేక విడాకులు కావాలని కోరడంతో, ఆమెపై పగ పెంచుకున్న రాజ్ కుమార్.. చివరకు భార్యను, ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన షాబాద్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: Albendazole Tablets | చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు వేయాలి: మంత్రి రాజనర్సింహ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *