Eagle Force | ఒడిశా నుంచి గంజాయి.. 400 కిలోలు అమ్మిన ముఠా

ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్​లో విక్రయిస్తున్న ముఠాను ఈగల్​ ఫోర్స్​ అరెస్ట్ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Eagle Force | హైదరాబాద్​ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి లభిస్తోంది. ఆ మత్తు పదార్థానికి బానిసలుగా మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఈగల్​ ఫోర్స్​, ఎక్సైజ్​ అధికారులు, పోలీసులు దాడులు చేస్తున్నా.. గంజాయి దందా ఆగడం లేదు. తాగాజా భారీ అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఈగల్​ ఫోర్స్​ అరెస్ట్ చేసింది. ఈ ముఠా 10 నెలల్లో ఏకంగా 400 కిలోల గంజాయి అమ్మడం గమనార్హం. 60 రోజుల సుదీర్ఘ గాలింపు అనంతరం ఈగల్​ ఫోర్స్​ ముఠా నాయకుడైన అస్సాంకు చెందిన భాస్కర్ హజారికాతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసింది. వారి నుంచి 24.7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది.

Eagle Force | సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ..

అస్సాంకు భాస్కర్ హజారికా (31) బతుకు దెరువు కోసం హైదరాబాద్​ నగరానికి వచ్చాడు. తొలుత సెక్యూరిటీ గార్డుగా, అనంతరం స్విగ్గీ/జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేశాడు. 2020 నుంచి 2023 వరకు మళ్లీ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఈ సమయంలో అతడు గంజాయి అమ్మకం ప్రారంభించాడు. పితరంజన్ నాయక్ అనే వ్యక్తి ద్వారా ఒడిశా నుంచి గంజాయిని సేకరించి నగరంలో విక్రయాలు జరిపేవాడు. గతంలో పలుమార్లు భాస్కర్​ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ఫై విడుదల అయ్యాక మళ్లీ గంజాయి దందా చేపట్టేవాడు.

Eagle Force | భారీ నెట్​వర్క్​

నిందితుడు హైటెక్​ సిటీలోని ఐకియా సమీపంలో ఫుట్​పాత్​పై హోటల్​ నడుపుతున్నాడు. అస్సాం నుంచి తన సహచరులను రప్పించి నగరంలో గంజాయి దందా కోసం భారీ నెట్​వర్క్​ నిర్మించుకున్నాడు. ఒడిశాకు చెందిన ఆశిష్ కుమార్ బలియార్‌సింగ్, దేబాసిస్ నాయక్ అలియాస్ పింకు నాయక్ నుంచి కిలోకు రూ. 12,000-15,000 చొప్పున గంజాయిని కొనుగోలు చేసేవాడు. దానిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి నగరంలో విక్రయించేవాడు. ఇలా కిలోకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించేవాడు. 10 నెలల్లో అతను సుమారు 400 కిలోల గంజాయిని అమ్మి ఏకంగా రూ.1.8 కోట్లకు పైగా వ్యాపారం చేశాడు. ఈ మేరకు పోలీసులు ప్రధాన నిందితుడు భాస్కర్ హజారికాతో పాటు బాబు బోరా(రాపిడో డ్రైవర్, కొరియర్) నిర్మల్ హజారికా ప్రైవేట్ ఉద్యోగి, కొరియర్, ప్రాంజల్ దత్తా ఉబెర్ డ్రైవర్, – అకాన్ రాజ్‌బన్షిని అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : Kerala Gold Smuggling | గోల్డ్ కొట్టేసేందుకు లేడీ స్మగ్లర్ ప్లాన్.. పోలీసుల ఎంట్రీతో ప్లాన్ రివర్స్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *