HYDRAA Land Protection | రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్​ నగరంలో హైడ్రా ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Land Protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో హైడ్రా మరో భారీ ఆపరేషన్​ చేపట్టింది. ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది.

మాదాపూర్ సైబ‌ర్‌ ట‌వ‌ర్స్‌ (Cyber Towers)కు చేరువ‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. హైకోర్టు తీర్పు మేర‌కు హైడ్రా ఈ చ‌ర్య‌లు తీసుకుంది. ఈ భూమి విలువ దాదాపు 3 వేల కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని 41/12, 13, 14 స‌ర్వే నంబ‌ర్ల‌లో మొత్తం 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. ఈ భూమి త‌మ‌దంటూ ఇట్టినా ప్రాప‌ర్టీస్ సంస్థ క్లైమ్ చేస్తూ వ‌స్తోంది. ఆ భూముల‌ను ఖాళీ చేయాల‌ని కోరుతూ 2016లో టీజీఐఐసీ వాళ్లు ఇట్టినా ప్రాప‌ర్టీస్ సంస్థ‌కు నోటీసులు జారీ చేశారు.

HYDRAA Land Protection | నకిలీ పత్రాలు

ఈ నోటీసుల‌ను స‌వాల్ చేస్తూ ఇట్టినా సంస్థ హైకోర్టును ఆశ్ర‌యించింది. జ‌స్టిస్ న‌గేశ్ భీమ‌పాక విచార‌ణ చేపట్టారు. మాజీ సైనికుల కోటా కింద ప్ర‌భుత్వం 1963లో ఆ భూమి కేటాయించినట్లు ఎక్క‌డా ఆధారాలు లేవ‌ని.. పిటిష‌న‌ర్ స‌మ‌ర్పించిన ప‌ట్టా ప‌త్రాలు న‌కిలీవ‌ని రెవ‌న్యూ అదికారులు ఆధారాల‌తో కోర్టుకు నివేదించారు. న‌కిలీ ప‌త్రాల‌తో ప్ర‌భుత్వ భూమిని కొట్టేయాల‌ని పిటిష‌న‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కోర్టు నిర్ధారించుకుని.. ఆ భూములను ర‌క్షించాల‌ని రెవెన్యూ అదికారుల‌ను ఆదేశించింది. రెవెన్యూ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది.

దీనిని కూడా చదవండి : Nanakramguda Drug Bust | కిరాణా షాపులో గంజాయి దందా.. గుట్టురట్టు చేసిన ఈగల్ టీం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *