Modi Governance | అధికారాన్ని సేవగా భావిస్తా : ప్రధాని మోదీ

అధికారాన్ని తాను సేవగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తెచ్చామన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Governance | అధికారాన్ని తాను సేవగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. మోదీ పాలనకు నేటితో 12 ఏళ్లు ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నా జీవితంలో ఇది అద్భుతమైన క్షణం.. దేశ ప్రజలే నాకు దేవుళ్లు.. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం రావడం నా అదృష్టం అని మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు. ఎన్డీఏ వచ్చాక దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.

Modi Governance | గర్వపడుతున్నాం

తాము తెచ్చిన పథకాలతో వచ్చిన మార్పులు చూసి గర్వపడుతున్నామని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చామని చెప్పారు. 2014కు ముందు దేశంలో అనేక సమస్యలు ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చాక దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తెచ్చామని తెలిపారు.

Modi Governance | కాంగ్రెస్​ పాలనలో స్కాంలు

కాంగ్రెస్‌ పరిపాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్‌ పరిపాలనలో రూ.వేల కోట్ల స్కాంలు జరిగాయన్నారు. ఆ పార్టీ తన వైఫల్యాలను హిందువులపై నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలని ప్రజలను కోరారు. తమది లెక్కల ప్రభుత్వం కాదు.. ఆచరణాత్మక ప్రభుత్వం అన్నారు. నేషన్‌ ఫస్ట్ అన్నదే తమ నినాదని మోదీ పేర్కొన్నారు. నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేశామని ప్రకటించారు. విదేశాలపై ఆధారపడటం తగ్గించాలని ప్రధాని అన్నారు. అందుకే సెమీ కండక్టర్‌, క్రిటికల్‌ మినరల్స్‌పై దృష్టి పెట్టామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి : HYDRAA Land Protection | రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *