అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mumbai Pune Railway | భారీ వర్షాలతో భోర్ ఘాట్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, వరదలు, నీరు నిలిచిపోవడంతో రద్దీగా ఉండే ముంబై-పుణె మార్గంలో రైలు సేవలకు, పుణె-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, పాత పుణె-ముంబై హైవేపై ట్రాఫిక్‌కు సోమవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు రైలు, రోడ్డు మార్గాల రాకపోకలను నిలిపివేశారు.
కర్జత్-లోనావాలా భోర్ ఘాట్ ప్రాంతంలో భారీ వర్షాల (Heavy Rain) కారణంగా కొండచరియలు విరిగిపడటంతో, ముంబై-పుణె రైలు మార్గంలో సోమవారం తెల్లవారుజామున రైలు సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఘాట్ ప్రాంతంలోని ఠాకుర్‌వాడి సమీపంలో ఒక కొండచరియ విరిగిపడగా, ఖండాలా, మంకీ హిల్ మధ్య మార్గంలో తెల్లవారుజామున 3.05 గంటల ప్రాంతంలో మరొకటి విరిగిపడింది. దీంతో మూడు రైల్వే లైన్లు ప్రభావితమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
Mumbai Pune Railway | రద్దు చేసిన రైళ్లు
సీఎస్ఎంటీ-పుణె ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ క్వీన్, ప్రగతి ఎక్స్‌ప్రెస్, ధూలే ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. పుణె-సీఎస్ఎంటీ సింహగడ్ ఎక్స్‌ప్రెస్, ఇతర రైళ్లతో సహా అదనపు సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. అదే సమయంలో అనేక దూరప్రాంత రైళ్లను దారి మళ్లించడం, గమ్యస్థానానికి ముందే ముగించడం, గమ్యస్థానానికి ముందే ప్రారంభించడం, రీషెడ్యూల్ చేశారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Mumbai Pune Railway | హెల్ప్‌లైన్ నంబర్ల ఏర్పాటు

ప్రయాణికులకు సహాయం చేయడానికి, సెంట్రల్ రైల్వే ప్రధాన స్టేషన్లలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు CSMT (022-22694040), థానే (9321336747), లోనావాలా (8356854238) మరియు దాదర్ (9136452387). సోమవారం మధ్యాహ్నం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో పలు రోడ్లు కూడా ధ్వంసం అయ్యాయి.సోమవారం పుణే-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, పాత పుణే-ముంబై హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఈ మార్గాల్లో ప్రయాణం చేయొద్దని అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి రైల్వే సర్వీసుల నిలిపివేత
భారీ వర్షాల కారణంగా లోనావాలా-కర్జత్ ఘాట్ సెక్షన్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కీలకమైన ముంబై-పుణె మార్గంలో సర్వీసులను నిలిపివేశారు. ట్రాక్‌ల నుంచి బురద, శిథిలాలను తొలగించడానికి రైల్వే సిబ్బంది రాత్రంతా… pic.twitter.com/lb4Bj9qBUs
— Akshara Today | Telugu News (@aksharatoday) July 6, 2026
ఇది కూడా చదవండి..: Madhya Pradesh Waqf Board | వక్ఫ్ బోర్డులో హిందువులకు చోటు.. మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం