Vijay Floor Test | బల పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Floor Test | తమిళనాడు (Tamil Nadu)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో సీఎం విజయ్​ నెగ్గారు. టీవీకే ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే విజయ్​ (CM Vijay) ఒక చోట రాజీనామా చేయడం, మరో ఎమ్మెల్యే బలపరీక్షలో పాల్గొనకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 106కు తగ్గింది. అయితే కాంగ్రెస్​, వామపక్షాలు, ముస్లింలీగ్​ మద్దతుతో విజయ్​ ప్రభుత్వం (Vijay Government) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలతో ఆయన బలం 118కు చేరగా.. బల పరీక్షలో ఏకంగా 144 ఓట్లు అనుకూలంగా రావడం గమనార్హం.

Vijay Floor Test | అన్నాడీఎంకే రెబల్​ ఎమ్మెల్యేల సపోర్టు​

బలనిరూపణకు అవసరమైన మెజార్టీకన్నా అధికంగా విజయ్‌కు మద్దతు వచ్చింది. అన్నాడీఎంకే రెబెల్‌ ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బలం పెరిగింది. విజయ్‌కు వ్యతిరేకంగా డీఎంకే, ADMK పళనిస్వామి వర్గం, పీఎంకే ఉండగా.. కాంగ్రెస్​, వామపక్షాలు, వీసీకే, ముస్లింలీగ్​, అన్నాడీఎంకే షన్ముగం వర్గం అనుకూలంగా ఉంది. దీంతో విజయ్​ విశ్వాస పరీక్షలో గెలుపొందారు.

Vijay Floor Test | వ్యతిరేకంగా 22 ఓట్లు

టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుపగా, విజయ్‌కు వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేల ఓటు వేశారు. అసెంబ్లీ నుంచి 61 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బలపరీక్ష సమయంలో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీలకు సీఎం విజయ్ ధన్యవాదాలు తెలిపారు. “కొందరు దీనిని మైనారిటీ ప్రభుత్వం అని పిలవాలనుకుంటే, మేము దానిని సంతోషంగా స్వీకరిస్తాము. మేము మైనారిటీ వర్గాలను కాపాడుతాము మరియు అన్ని వర్గాల ప్రజల కోసం పరిపాలిస్తాము,” అని విజయ్ అన్నారు. ప్రభుత్వం లౌకికవాదం, సామాజిక న్యాయ సూత్రాలపై పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Vijay Floor Test | ఉదయనిధి విమర్శలు

టీవీకే ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్​ విమర్శలు చేశారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందన్నారు. 65 శాతం మంది ఓటర్లు విజయ్‌ను తిరస్కరించారని పేర్కొన్నారు. డీఎంకే కూటమిలోని పార్టీలే టీవీకేకు మద్దతిస్తున్నాయన్నది మర్చిపోవద్దని గుర్తు చేశారు. విజయ్‌కి నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారన్నారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదన్నారు. అనంతరం బల పరీక్ష సమయంలో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.

ఇది కూడా చదవండి..: NEET Paper Leak | రూ.30 లక్షలకు నీట్​ పేపర్​ కొనుగోలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *