Kharge Gyanesh Kumar | మోదీ ప్రభుత్వానికి సీఈసీ కీలుబొమ్మ.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

దేశంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Shivam nagarani

అరటుడే వెబ్‌డెస్క్: Kharge Gyanesh Kumar | దేశంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై, సీఈసీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Kharge Gyanesh Kumar | కీలుబొమ్మలా మారిన సీఈసీ..

ప్రధాని నరేంద్ర మోదీ  ( Narendra Modi ) ప్రభుత్వానికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ కేవలం ఒక “కీలుబొమ్మ”లా మారామని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదవిలో కొనసాగే నైతిక హక్కు జ్ఞానేష్ కుమార్‌కు లేదని, తక్షణమే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.

Kharge Gyanesh Kumar | డిమాండ్లు ఇవే..

ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి కీలక మార్పుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
జాబితా నుంచి తొలగించిన ఓటర్లకు ఆ సమాచారాన్ని స్పష్టంగా తెలిపి, వారు తిరిగి తమ పేర్లను నమోదు చేసుకునేందుకు తగిన అవకాశం కల్పించాలి.
ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్తి డేటాను రాజకీయ పార్టీలు సులభంగా అర్థం చేసుకునే రీతిలో సకాలంలో అందించాలి.
ఎన్నికల ప్రక్రియలో లేదా ఓటర్ల తొలగింపులో జరిగే అక్రమాలు, అసమానతలపై స్వతంత్ర సంస్థతో కాలపరిమితితో కూడిన విచారణ జరిపించాలి.
ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు, డేటా విషయంలో ఎలాంటి సమాచారాన్ని దాచకుండా పూర్తి పారదర్శకత పాటించాలి.

ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, తొలగించిన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని CWC సమావేశంలో తీర్మానించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు పార్లమెంట్ వేదికగా, న్యాయస్థానాల్లోనూ, అవసరమైతే వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Anantapur RTC Driver | ఫ్రీ బస్సే కదా.. మూసుకొని ఎక్కు: మహిళను బూతులు తిట్టిన డ్రైవర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *