Anantapur RTC Driver | ఫ్రీ బస్సే కదా.. మూసుకొని ఎక్కు: మహిళను బూతులు తిట్టిన డ్రైవర్

తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై అప్పుడప్పుడు వివాదాలు తలెత్తుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Anantapur RTC Driver | తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై అప్పుడప్పుడు వివాదాలు తలెత్తుతున్నాయి. కొందరు ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనే తీవ్ర కలకలం రేపింది.

Anantapur RTC Driver | డ్రైవర్ అసభ్య పదజాలం..

అనంతపురం జిల్లా బత్తులపల్లి గ్రామంలో ఓ మహిళ ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో బస్సు డోర్ క్లోజ్ చేయాలని ఆమె సూచించగా, డ్రైవర్ తీవ్రంగా మండిపడ్డాడు. మహిళల ఉచిత ప్రయాణాన్ని కించపరుస్తూ.. అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించినట్లు బాధితురాలు వాపోయింది. “ఫ్రీ బస్సే కదా.. మూసుకొని బస్సు ఎక్కు” అంటూ అందరి ముందూ ఆమెను అవమానించేలా మాట్లాడాడని ఆరోపించింది.

Anantapur RTC Driver | కలెక్టరేట్ ఎదుట నిరసన..

డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించలేకపోయిన బాధితురాలు, తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగింది. మరోవైపు, డ్రైవర్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ బంధువులు అతనిపై దాడికి దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్‌పై శాఖాపరంగా , చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Bodhan Municipal Meeting | బల్దియా సమావేశంలో కౌన్సిలర్లను మాట్లాడనివ్వరా..?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *