అక్షరటుడే వెబ్‌డెస్క్: BJP State Incharges | వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ (BJP) సంస్థాగతంగా భారీ ప్రక్షాళన చేపట్టింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నూతన ఇన్‌చార్జ్‌లు, సహ-ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ అధిష్టానం అధికారికంగా జాబితాను విడుదల చేసింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించేలా అగ్రనేతలకు బాధ్యతలు కేటాయించింది.
BJP State Incharges | కీలక బాధ్యతలు..
పార్టీలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు సీనియర్ నాయకులకు రాష్ట్రాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీకి ( Smriti Irani ) హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఇన్‌చార్జ్ బాధ్యతలు దక్కాయి. అలాగే, పార్టీ వ్యూహకర్తగా పేరున్న సునీల్ బన్సల్‌కు పశ్చిమ బెంగాల్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ బాధ్యతలను కేటాయించారు. మరోవైపు రామ్ మాధవ్‌కు ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించగా, ఉత్తరప్రదేశ్ (UP) రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌గా వినోద్ తావ్డే కొనసాగనున్నారు.
BJP State Incharges | తెలుగు రాష్ట్రాల నేతలకు ..
ఈ నియామకాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా జాతీయ స్థాయిలో సముచిత స్థానం లభించింది. ఒడిశా రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌గా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించగా, మహబూబ్‌నగర్ ఎంపీ డికే అరుణకు తమిళనాడు సహ-ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక తెలంగాణకు సంబంధించి సునీల్ బన్సల్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనుండగా, ఆయనకు సహకరించేందుకు అభయ్ పాటిల్, రేఖా శర్మలను సహ-ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
BJP State Incharges | ప్రముఖ ఇన్‌చార్జ్‌లు..
దేశంలోని ఇతర ప్రాంతాలపై పట్టు బిగించేందుకు వీలుగా పలువురు జాతీయ నేతలకు పార్టీ బాధ్యతలు కేటాయించింది. ఇందులో భాగంగా ఢిల్లీ ఇన్‌చార్జ్‌గా డాక్టర్ వినయ్ సహస్రబుద్ధేను నియమించగా, మహారాష్ట్ర బాధ్యతలను జైజయంత జయ పాండాకు (సహ-ఇన్‌చార్జ్‌లుగా అమిత్ మాల్వియా తదితరులు) అప్పగించారు. అలాగే బీహార్‌కు హరీష్ ద్వివేది, జమ్మూ కాశ్మీర్‌కు డాక్టర్ సతీష్ పూనియా, గుజరాత్‌కు తరుణ్ చుగ్ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంతాన్ని మరింత పటిష్టం చేయడం, రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయమే లక్ష్యంగా ఈ సంస్థాగత మార్పులు చేపట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Nizamabad IT Tower | ఐటీ టవర్‌ను సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్రా