అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad IT Tower | జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ను కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) బుధవారం సందర్శించారు. ఐటీ టవర్ కేంద్రంగా కొనసాగుతున్న వివిధ కంపెనీల వివరాలను, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
Nizamabad IT Tower | 13 కంపెనీల్లో..
ప్రస్తుతం 13 కంపెనీలలో 380 మంది వరకు పని చేస్తున్నారని టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శివ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా కంపెనీల నిర్వాహకులను, అందులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులను కలిసి స్థానికంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. సాధ్యమైనంత మేరకు ఎక్కువ కంపెనీలు స్థానికంగా నెలకొల్పేలా చూడాలని, తద్వారా ఈ ప్రాంత యువతకు స్థానికంగా మరింత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచించారు. వినూత్న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలకు ఐటీ టవర్ చక్కటి వేదికగా నిలుస్తుందని, దీనిని ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట టీజీఐఐసీ ఏఈ శివకృష్ణ ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Ganesh Immersion Safety | శోభాయాత్రలో మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి