అక్షరటుడే, ఇందూరు: Varahi Navaratri Festival | నగరంలోని (Nizamabad) అమ్మవెంచర్లో నూతనంగా నిర్మించిన వారాహి మాత (Varahi Mata Temple) ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
Varahi Navaratri Festival | ప్రత్యేక పూజలు
ఈనెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు వారాహి మాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మంచాల జ్ఞానేందర్ పేర్కొన్నారు. నవరాత్రులు అమ్మవారికి విశేషపూజలు నిర్వహించామన్నారు. చివరిరోజు గురువారం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, మహాయజ్ఞం, పల్లకీ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపామని పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ నిర్వహించినట్లు మంచాల జ్ఞానేందర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఉద్యోగిని ధర్నా..