Illegal Tree Cutting | అనుమతి లేకుండా చెట్ల నరికివేతపై అటవీ శాఖ చర్యలు

జిల్లాలోని నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Illegal Tree Cutting | జిల్లాలోని (Nizamabad) నవీపేట్ (navipet) మండలం లింగాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు (Nizamabad Forest Department) చర్యలు చేపట్టారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేశారు.

Illegal Tree Cutting |  అనుమతి లేకుండా 15 చెట్లు..

అటవీశాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్​ గ్రామంలో ఈనెల 15న నిర్వహించిన తనిఖీలలో, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందకుండా 15 చెట్లను నరికివేసినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ (WALTA) చట్టం, 2002, తెలంగాణ వాల్టా నిబంధనలు, 2004లోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో లింగాపూర్​నకు చెందిన దొడ్డల బాలరాజ్​ను నిందితుడిగా గుర్తించారు. అనుమతి లేకుండా చెట్లను నరికివేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. తనిఖీ సందర్భంగా నరికివేసిన 15 చెట్లను పరిశీలించి, వాటి కలప పరిమాణం, విలువను అంచనా వేయగా, కలప విలువ సుమారు రూ.4,692/-గా నమోదు చేశారు. శాఖ రికార్డుల ప్రకారం నిందితుడి నుండి రూ.9,384/- పరిహారాన్ని ఫీజుగా వసూలు చేశారు. అనంతరం నరికేసిన చెట్లను స్వాధీనం చేసుకున్నారు. యాంచ బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధీర్ కుమార్, నవీపేట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహేంద్ర కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది.

 

ఇది కూడా చదవండి: Indian Stock Market | ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *