Kapu Corporation | రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తాం

రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ సేవలను మరింతగా విస్తరిస్తామని ఛైర్మన్​ శ్రీరాం చక్రవర్తి పేర్కొన్నారు. ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Kapu Corporation | రాష్ట్రంలో మున్నూరు కాపు (Munnuru Kapu) కార్పొరేషన్ సేవలను మరింతగా విస్తరిస్తామని ఛైర్మన్​ శ్రీరాం చక్రవర్తి (Sriram Chakravarthi) పేర్కొన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్తమ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Kapu Corporation | త్వరలోనే కార్పొరేషన్​ ద్వారా విధివిధానాలు..

కొత్తగా ఏర్పాటు చేసిన మున్నూరు కాపు కార్పొరేషన్ (Munnuru Kapu Corporation) విధివిధానాలను త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చేవిధంగా కృషి చేస్తామని శ్రీరాం చక్రవర్తి అన్నారు. రాష్ట్ర రాజధానిలో పూర్తిస్థాయి కార్యాలయం ఏర్పడ్డ తర్వాత మున్నూరు కాపులు ఎవరైనా సమస్యల పరిష్కారానికి తమ వద్దకు వస్తే ఆ దిశలో పరిష్కారానికి తమవంతు సహకారం (community development) అందిస్తామన్నారు. ప్రతి జిల్లాలో కాపు సంఘాల కార్యాలయాల్లో, కళ్యాణ మండపాల్లో కార్పొరేషన్​కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేలా నోటీసులు అంటిస్తామన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ జీవో ప్రకారం కాపులకు జిల్లాలో వసతి గృహాల కోసం రెండెకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా సంఘాల ప్రతినిధులు తమను సంప్రదిస్తే ప్రభుత్వ దృష్టికి స్థలం ప్రతిపాదనను తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Kapu Corporation | కాపుల అభ్యున్నతికి జిల్లా కమిటీ కృషి..

కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) మాట్లాడుతూ కాపు కుటుంబాల అభ్యున్నతికి జిల్లా కమిటీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. కాపు విద్యార్థులు అందరూ రాణించి వివిధ స్థాయిలో స్థిరపడాలన్నదే తమ అభిమతమన్నారు. ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) ఐఆర్ఎస్ (IRS) ఐఎఫ్ఎస్సీ తదితర కోర్సుల్లో చేరి ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ కోసం అభ్యసించేందుకు జిల్లా సంఘం కమిటీ సభ్యులను సంప్రదిస్తే ఆర్థిక సాయం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సభకు జిల్లా మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్​ అధ్యక్షత వహించగా.. ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ ప్రతిభ అవార్డ్స్ నివేదికను సమర్పించారు.

కార్యక్రమంలో మున్నూరుకాపు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇట్యాల వెంకట కిషన్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, మాజీ జడ్పీటీసీ గోపి, సంఘం కోశాధికారి సురేష్, ఉపాధ్యక్షులు నరేష్, హరిచరణ్, సలహాదారులు అబ్బాయి లింబాద్రి, చిట్టి నారాయణరెడ్డి, శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు సల్ల సత్యనారాయణ అర్జున్, శేఖర్, మహిళ కార్యదర్శులు స్వర్ణలత, యెండల స్వప్న, పట్టణంలోని వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు బంటు బలరాం, బుడుగు కిషన్ రెడ్డి, కురువ నర్సయ్య, సంతోష్, సూదం సాయన్న, మిద్దె రవికుమార్, కొరటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఎస్సెస్సీ, ఇంటర్​, పీజీ సెట్, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రంతో పాటు గోల్డ్ మెడల్​తో సత్కరించారు. రిటైర్డ్​ ఉద్యోగి అర్సపల్లి గ్రామస్థుడు సిర్ప లింగం పాడిన పాటకు మంత్రముగ్దులైన మాజీ మేయర్​, మున్నూరుకాపుసంఘం సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​ ఆయనకు రూ.50వేల నగదు బహుమతి అందజేశారు. ​ముందుగా రెంజర్ల జిగిషా పటేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు ఘనంగా సత్కరించారు.

class

 

ఇది కూడా చదవండి: Bachupally Flyover | తీరనున్న ట్రాఫిక్​ తిప్పలు.. బాచుపల్లి ఫ్లైఓవర్​ ప్రారంభించనున్న సీఎం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *